ఎర్ర బియ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే.. దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయాల్సిందే

ఎర్ర బియ్యం పైన ఉన్న బ్రాన్‌ పొరను తొలగించకపోవడంతో.. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి.

ఇలా పొట్టుతో ఉండడం వల్ల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలన్నీ మిగులుతున్నాయి.

ఎర్ర బియ్యంలో మంచి డైటరీ ఫైబర్ ఉంటుంది. తద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

ఎర్ర బియ్యం యొక్క గ్లైసెమిక్ సూచిక తెల్ల బియ్యం కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఆహారం.

ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ బియ్యాన్ని ఎర్రగా మారుస్తాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి

ఎర్ర బియ్యం లోని పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రెడ్‌ రైస్‌ తినడం వలన కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.