Kadiyam Srihari: ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలం కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా స్థానిక నాయకత్వం బేఖాతర్ చేసిందని మండిపడ్డారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశానికి నాకు సమాచారం లేదని అన్నారు. ఎన్నికలలో నాకు సహాయం చేయమని ఎమ్మెల్యే అనడంతో, పార్టీ నిర్ణయానికి కట్టుబడి సొంత డబ్బులు పెట్టుకుని పని చేశానని అన్నారు. ఏమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిస్వార్ధంగా పని చేసినా అన్నారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి గారే స్వయంగా అన్నారని స్పష్టం చేశారు.
Read also: Narendra Modi : ప్రధాని మోడీకి ముద్దు పెట్టిన రైతు
ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు ఒక్కరే నా ఎన్నికలకు పని చేశారన్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు ఉన్నప్పుడు సహాయం అడుగుతున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలకు నాకు ఆహ్వానం ఇస్థలేరని తెలిపారు. నాకు అవకాశం ఉన్నప్పుడు నిజాయితీగా పని చేశానని, సొడశపల్లి సమావేశంలో కడియం శ్రీహరి అంటే ఏంటో తెలిసిందని తెలిపారు. ఇప్పటికైనా ఆత్మీయ సమావేశాలకు సమాచారం ఇవ్వాలని, లేకపోతే పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
Bhatti Vikramarka: ప్రజల కోసమే నా పాదయాత్ర.. వారి బాధలను ప్రభుత్వానికి చెప్పేందుకే..