Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గెలుపు ఖాయం.. మెజార్టీ కోసం పోటీ చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించి మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్ల కోసం మైనారిటీ జపం చేస్తున్నారని మండిపడ్డారు.
ముస్లింలకు ఉద్యోగాల్లో 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మోడీ వాస్తవం మాట్లాడుతుంటే.. రాజకీయంగా ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుందన్నారు. మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే కాంగ్రెస్ సహించ లేక కర్ణాటకలో ముస్లింలను బీసీలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని మాజీ సీఎం న్యాయ స్థానాలను ప్రశ్నించడం అంటే ఎంత నిరాశలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు.
Read also: Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
ఇక ఆయన బిడ్డపై ప్రేమతో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నారని, కేసుతో సంబంధం ఉన్నవారు లొంగిపోయి నిజాలు బయటపెడుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. అంతే కాకుండా.. కేసీఆర్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, పార్టీ ఫిరాయింపులను హోల్‌సేల్‌గా ప్రోత్సహించారని, మంత్రి పదవులు దిగజారి రాజకీయం చేశారని మండిపడ్డారు. బీజేపీ ఏ ప్రభుత్వాన్ని పడగొట్టదని, బీజేపీకి ఎలా సాధ్యమని అన్నారు.
ఇక.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 8 సీట్లతో అధికారంలోకి రావడానికి బీజేపీయే అధికారంలో ఉంది. అంతేకాకుండా.. పైగా బీఆర్‌ఎస్‌కు 17 స్థానాల్లో డిపాజిట్లు దక్కితే ఆకాశమే హద్దు అని, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీయే ఎక్కువగా గెలుస్తోందని తెలిపారు. సికింద్రాబాద్‌లో తమదే గెలుపు ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.. మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Revanth Reddy: రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కి.. వద్దు అనుకుంటే బీజేపీ కి ఓటు వేయండి