Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Seethakka Comments On Medaram Jathara Development

Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!

Published Date :September 10, 2025 , 2:54 pm
By Gogikar Sai Krishna
  • మాజీ సీఎం కేసీఆర్‌పై మేడారం జాతర నిర్లక్ష్యం ఆరోపణలు
  • గద్దెల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క ఆగ్రహం
  • భక్తుల సౌకర్యాలను ప్రతిష్టాత్మకంగా చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం
Minister Seethakka : మేడారం జాతరపై రాజకీయాలు వద్దు.. గద్దెల మార్పుపై సీతక్క ఆగ్రహం.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Seethakka : మేడారం మహాజాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏబీఎన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర నిర్వహణ, అభివృద్ధి పనులపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సీతక్క తెలిపారు.

మేడారం జాతరలో భక్తులు వేసే కానుకలను, బంగారం, డబ్బును ఉంచే గద్దెల వద్ద కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. తాము, పూజారులు కలిసి చేసిన మార్పులు సీఎం రేవంత్ రెడ్డికి సంతృప్తి కలిగించలేదని, అందుకే ఆయనే స్వయంగా గద్దెల వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించనున్నారని ఆమె వివరించారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్

గద్దెల మార్పుపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండానే ఈ మార్పులు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. “మేడారం జాతర ఒక పవిత్రమైన ఉత్సవం. దానిని రాజకీయాలకు వేదికగా మార్చవద్దు. ఇది కేవలం భక్తితో చూడాల్సిన విషయం” అని ఆమె హితవు పలికారు. మహాజాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి సౌకర్యాలు మెరుగుపరచడానికే ఈ మార్పులు చేస్తున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన జాతరకు ఇప్పుడు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామని, భక్తులు సంతోషంగా తమ మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, భక్తుల భద్రత, సౌకర్యాలపై పూర్తి శ్రద్ధ పెట్టిందని సీతక్క చెప్పారు. జాతర నిర్వహణలో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తోందని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఈ పనుల వేగం మరింత పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Mega Meet : ‘మన శంకర వరప్రసాద్’ ను కలిసిన ‘బెగ్గర్’.. ఫోటో వైరల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Medaram Jathara
  • revanth reddy
  • seethakka
  • Telangana Festivals
  • telangana government

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions