Seetakka: రాహుల్ గాంధీ చేతికి రాఖీ కట్టిన సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీకి వివరించారు.
Also Read
రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు. రాహుల్ ను పలకరించిన సీతక్క తనతో పాటు తెచ్చిన రక్షను రాహుల్ చేతికి కట్టారు. సీతక్క ఆప్యాయతకు స్పందనగా రాహుల్ గాంధీ ఆమె భుజం తట్టారు. అనంతరం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అభివాదాలను స్వీకరిస్తూ వేదికపైకి సాగారు రాహుల్ గాంధీ. వరంగల్ సభ అధ్యక్షురాలిగా అంతా తానై వ్యవహరించారు సీతక్క. నేతల్ని పలకరించి, సభను ఎలా నడపాలో వివరించారు. రాహుల్ గాంధీ వచ్చేవరకూ ఆమె సభను నిర్వహించారు.
VijayaSaiReddy: మొరిగే కుక్క కరవదు.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..