Site icon NTV Telugu

Seetakka: రాహుల్ గాంధీ చేతికి రాఖీ క‌ట్టిన సీత‌క్క‌

వ‌రంగ‌ల్ లో రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రాహుల్ గాంధీకి వివరించారు.

రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు. రాహుల్ ను పలకరించిన సీతక్క తనతో పాటు తెచ్చిన రక్షను రాహుల్ చేతికి కట్టారు. సీతక్క ఆప్యాయతకు స్పందనగా రాహుల్ గాంధీ ఆమె భుజం తట్టారు. అనంతరం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అభివాదాలను స్వీకరిస్తూ వేదికపైకి సాగారు రాహుల్ గాంధీ. వరంగల్ సభ అధ్యక్షురాలిగా అంతా తానై వ్యవహరించారు సీతక్క. నేతల్ని పలకరించి, సభను ఎలా నడపాలో వివరించారు. రాహుల్ గాంధీ వచ్చేవరకూ ఆమె సభను నిర్వహించారు.
VijayaSaiReddy: మొరిగే కుక్క కరవదు.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే

Exit mobile version