NTV Telugu Site icon

Security Guard Stuck Lift: కాళ్లు బయట.. లోపల తల.. లిప్ట్ లో సెక్యూరిటీ గార్డు నరకం..

Security Guard Stuck Lift

Security Guard Stuck Lift

Security Guard Stuck Lift: లిఫ్ట్ లో హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. కాళ్ళు బయట బాడీ లోపల ఇరుక్కు పోవడంతో గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలతో సెక్యూరిటీ గార్డును ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో చోటుచేసుకుంది.

ఇవాళ ఉదయం కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు బయట.. శరీరం లోపల ఉండటంతో ఊపిరి పీల్చుకునేకి నరక యాతన అనుభవించాడు. లిప్ట్ నుంచి బయటకు రావడానికి ఎంత ప్రయత్నించిన కుదరలేదు. చివరకు హెల్స్ అంటూ కేకలు వేయడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిని బ్యాంక్ దగ్గరకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

సెక్యూరిటీ గార్డను కాపాడేందుకు గంటన్నర శ్రమించి చాకచక్యంగా బటయకు తీసారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో సెక్యూరిటీ గార్డు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో సెక్యూరిటీ గార్డు గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు. అయితే ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మహేందర్ గౌడ్ బాడీ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయటకు పడి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కొన ఊపిరితో ఉన్న సెక్యూరిటీ గార్డును హుటా హుటిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే లిప్ట్ లో ఏమైన టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందా? సెక్యూరిటీ గార్డు లిప్ట్ ఎలా ఇరుక్కుపోయాడు. గార్డు ఎక్కేలోపే లిప్ట్ కదిలిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
SpiceJet Flight: విమాన టాయిలెట్లో ఇరుక్కుపోయిన యువకుడు