NTV Telugu Site icon

Manikrao Thakre: హైదరాబాద్ లో రెండో రోజు థాక్రే పర్యటన.. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో భేటీ

Manikrao Thakre

Manikrao Thakre

Second day of Thackeray visit to Hyderabad: హైదరాబాద్ నేడు టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే రెండో రోజు పర్యట కొనసాగుతుంది. ఇవాళ టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తో భేటీ కానున్నారు. తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో థాక్రే సమావేశం కానున్నారు. నిన్న అర్ధరాత్రి12 గంటల వరకు కొనసాగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. నాలుగున్నర గంటల పాటు సాగిన పీఏసీ సమావేశంలో నేతలకు సుతిమెత్తగా థాక్రే హెచ్చరించారు. నేతలంతా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. దేశం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే మీరు గొడవలకు దిగడం మంచిదేనా అంటూ కామెంట్స్ చేశారు థాక్రే.. వివాదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. పీఏసీలో హత్ సే హాత్ జోడోయాత్ర పై సుదీర్ఘంగా నేతలు చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు ప్రతీ ఒక్కరూ ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని థాక్రే సూచించారు.

Read also: Ankita Bhandari Case: నిందితుడి నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలకు కోర్టు ఆమోదం

అయితే.. రెండు రోజల పర్యటన నిమిత్తం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన థాక్రే గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అయ్యారు. ఈనేపథ్యంలో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు థాక్రే సూచించారు. ప్రతి పబ్లిక్ ఇష్యూను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు ఆయన చెప్పారు. అయితే.. సర్కార్ వ్యతిరేకతను పార్టీకి కలిసొచ్చేలా వ్యూహరచన చేయాలని నేతలకు థాక్రే సూచించిన ఆయన ఈగోలతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని సూచించారు. మనమంతా కుటుంబసభ్యులమేనని నేతలకు వివరించిన ఆయన ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలని మాణిక్ రావు థాక్రే నేతలకు చెప్పారు.
Janasena YuvaShakthi: రణస్థలంలో యువశక్తి సభకు అంతా రెడీ