సంక్రాంతి సెలవులు, కరోనా నిబంధనల అనంతరం పాఠశాలలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవాళ్టి నుంచి తెరుచుకుంటున్నాయి. కరోనా మూడో దశ, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల సంక్రాంతి సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు. మళ్లీ వాటిని తెరిచేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం నుంచి తెరచుకోనున్నాయి. సంక్రాంతి సెలవుల్లో భాగంగా జనవరి 8 నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. తెలంగాణలో కరోనా వల్ల సంక్రాంతి సెలవులను 31 వరకు పొడిగిస్తూ వచ్చారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. విశ్వవిద్యాలయాలూ ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. అయితే, సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈనెల 2 నుంచి ప్రారంభిస్తామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మరికొన్ని స్కూళ్ళలో మాత్రం కొద్దిరోజులపాటు ఆన్‌లైన్ తరగతులు జరపాలని నిర్ణయించాయి. అన్ని పాఠశాలల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించనున్నారు. మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ ఖచ్చితంగా అమలుచేయనున్నారు.
