Site icon NTV Telugu

Hyderabad : నాన‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నం.. కేటీఆర్ ట్వీట్

Ktr123

Ktr123

రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రో గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నాన‌మ్మ‌ను స్మ‌రించుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు. నా గ్రామం – నా పాఠ‌శాల కార్య‌క్ర‌మం కింద త‌న సొంత ఖ‌ర్చుల‌తో పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు.

అయితే.. ఇటీవలె ట్విట్ట‌ర్ వేదిక‌గా.. యంగ్ ఇండియా క‌ల సాకారం కావాలంటే.. కుల‌, మ‌తాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని మంత్రి కేటీఆర్ సూచించించారు. ఆ త‌ర్వాత ప్ర‌పంచంలోని అత్యుత్త‌మైన వాటితో పోటీ ప‌డాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. డెవ‌ల‌ప్‌మెంటల్ నేష‌న‌లిజ‌మ్ యువ‌త ఎంజెడాగా ఉండాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే స‌ముచిత స్థానంలో నిలిపేందుకు దారుల‌ను వెతుక్కోవాల‌న్నారు. ఇది ఇప్ప‌టికీ కాక‌పోతే ఎప్ప‌టికీ కాదు అని కేటీఆర్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’ అంటూ తన శైలిలో కేటీఆర్ ట్వీట్ వేదిగా పంచ్ వేశారు. తాజాగా జేపీ నడ్డాను ఉద్దేశించి చేసిన ట్వీట్ చేశారు.

హాలో.. నడ్డా జీ.. కర్ణాటకలో ముఖ్యమంత్రి కావాలంటే 2,500 రూపాయలు కోట్లు అడుగుతున్నారు అంట కదా..? అని కేటీఆర్ అడిగారు. 40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్, 30 శాత కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు కూడా అడుగుతున్నారని అన్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐల విచారణకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయంటూ మంత్రి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

కాగా.. కామారెడ్డి జిల్లా బేబీ పేట మండలం కోనాపూర్ గ్రామానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్న ఆయన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి కేటీఆర్ నివాళులర్పించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులను, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేయడం ఆనందంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Snake Hulchul: కలెక్టరేట్‌లో పాము కలకలం

Exit mobile version