స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్‌షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని సమాధానం ఇవ్వడం తో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాధితులు. వారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ లోని గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ కార్యాలయంపై దాడులు జరిపారు పోలీసులు. 1500 అప్లికేషన్‌లను స్వాధీనం చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఏ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.