Scarlet Fever: నగరంలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒకవైపు పరీక్షలు ప్రారంభమయ్యే తరుణంలో చిన్నారులను ఈ వ్యాధి పీడిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు వచ్చే 20 మంది జ్వర బాధితుల్లో 10-12 మందికి ఈ స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఈ వ్యాధి వచ్చినా కాస్త తగ్గింది. మళ్లీ ఇటీవలి కాలంలో పిల్లలపై విజృంభిస్తోంది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే చిన్నారుల్లో ఈ జ్వరం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
Read also: Egg Bajji : అయ్యో పాపం.. ఎంత పనైంది.. ఊపిరి తీసిన బజ్జీ..
వైరల్ లక్షణమని భావించి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆస్పత్రికి చేరేంత ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు. స్కార్లెట్ ఫీవర్ స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆతుంతపర్లు పక్కన వున్న పిల్లలకు అంటుకుంటుంది. ఈ తుంపర్లు పడే చోట మీ చేతులను ఉంచి, వాటిని మీ గొంతు, ముక్కుపై తాకినట్లయితే, దాని ప్రభావం పిల్లలకు చూపుతుంది. ఈ స్కార్లెట్ ఫీవర్ గురించి తల్లిదండ్రులను హెచ్చరిస్తూ నగరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే వాట్సాప్ సందేశాలు పంపాయి. లక్షణాలు కనిపిస్తే… వెంటనే వైద్యులను సంప్రదించి… వ్యాధి తగ్గే వరకు పిల్లలను పాఠశాలలకు పంపకూడదని తెలిపారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇవీ లక్షణాలు…
* 102 డిగ్రీల జ్వరం
* హఠాత్తుగా గొంతు నొప్పి
* తలనొప్పి, వికారం, వాంతులు
* కడుపు నొప్పి, శరీరం దద్దుర్లు
* నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారుతుంది
* గొంతు, నాలుకపై తెల్లటి పూత
* ట్రాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దగా కనిపిస్తాయి.
Astrology: మార్చి 1, శుక్రవారం దినఫలాలు