Site icon NTV Telugu

Saroornagar Case : రిమాండ్‌ రిపోర్ట్‌లో వెలుగు చూసిన కీలక విషయాలు

Saroon Nagar

Saroon Nagar

ఇటీవల సరూర్‌ నగర్‌లో జరిగిన పరువు హత్య కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నాగరాజును పథకం ప్రకారమే హత్య పోలీసులు వెల్లడించారు. నాగరాజు మొబైల్‌లో స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసిన నిందితులు.. నాగరాజు హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ప్రతి కదలికను మొబైల్‌ ద్వారా ట్రాక్‌ చేసినట్లు తెలిపారు. నిందితులు రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసినట్లు.. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్‌తో నాగరాజు హత్య చేసినట్లు పోలీసుల పేర్కొన్నారు.

నాగరాజు మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తెలుసుకొని మోబిన్‌.. నాగరాజు ఫోన్‌లో స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్కించి మొబైల్‌ ట్రాక్‌ చేసినట్లు గుర్తించారు. హత్యపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఇతర కీలకాంశాలను రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పొందుపరిచారు. ఇప్పటికే అరెస్ట్ చేసి నిందితులు సయ్యద్‌ మోబిన్‌ అహ్మద్, మసూద్ అహ్మద్ రిమాండ్ కి తరలించారు.

Exit mobile version