Sapta Sindhu 2025 : హైదరాబాద్‌లో AE ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సప్తసింధు-2025 – ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు” (Inter College Temple Model Making Competition) ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. బుధవారం టీ-హబ్‌లో జరిగిన ఈ పోటీలు విద్యార్థులు రూపొందించిన ఆలయ నమూనాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పద్మశ్రీ బృహత్ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ, “భారతీయ దేవాలయాల సృజనాత్మకత, శిల్ప సంపద ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆలయాలు భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు” అని అన్నారు.
Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం
పోటీల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. న్యాయనిర్ణేతలుగా YTDA సలహాదారు డాక్టర్ ఎస్ సుందరరాజన్, మంథా అసోసియేట్స్ ఎండీ శ్రీ రమేశ్ మంథా, ప్రధాన స్థపతి డిఎన్‌వి ప్రసాద్ వ్యవహరించారు.
మొదటి బహుమతి (₹50,000): కర్ణాటక శృంగేరి శ్రీ విద్యాశంకర ఆలయ నమూనా – జోగినపల్లి భాస్కర్ రావు (JBR) ఆర్కిటెక్చర్ కళాశాల బృందం.
రెండవ బహుమతి (₹30,000): మొతేరా సూర్య దేవాలయ నమూనా – శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు.
మూడవ బహుమతి (₹20,000): తెలంగాణ రామప్ప ఆలయ నమూనా – హైదరాబాద్ JNFAU విద్యార్థి బృందం.
స్థపతి డిఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన విద్యార్థులందరూ విజేతలే. కేవలం కొలమానాల ప్రకారం మాత్రమే బహుమతులను నిర్ణయించాం,” అని అభినందించారు.
తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ వకుళాభరణం మోహన్ రావు, “ఆలయాల శిల్పకళా వైభవాన్ని నగరానికి తీసుకువచ్చిన ఈ కార్యక్రమం విశేషం,” అని కొనియాడారు.
విశ్వ హిందూ రక్షా పరిషత్ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ, “హైదరాబాద్ చరిత్ర కేవలం 400 ఏళ్ళు కాదని, వేల ఏళ్ల వారసత్వం ఉందని సాక్ష్యాలు చూపుతున్నాయి,” అన్నారు.
సామాజిక కార్యకర్త రేఖారావు, సోషల్ మీడియా కార్యకర్త సురేష్ కొచ్చాటిల్ తదితరులు ఆలయాల విశిష్టతపై తమ అనుభవాలను పంచుకున్నారు.
చరిత్రకారుడు సురేంద్రనాథ్ బొప్పరాజు ఆలయాల శిల్పకళపై స్లయిడ్‌షో ప్రదర్శించగా, AE ఫౌండేషన్ డైరెక్టర్ సంగీతా మిశ్రా మాట్లాడుతూ, “ఆర్కిటెక్చర్ కేవలం ఆధునిక భవనాల నిర్మాణమే కాదు. భారతీయ నిర్మాణ రంగ చరిత్రను, శిల్ప వైభవాన్ని యువతకు తెలియజేయడమే ఈ పోటీ ఉద్దేశ్యం” అని అన్నారు. విద్యార్థుల రూపొందించిన నమూనాలను 10 రోజుల పాటు టీ-హబ్‌లో ప్రదర్శిస్తామని తెలిపారు. సప్తసింధు-2025 నిర్వహణలో సహకరించిన బృహత్, నెక్స్ వేవ్, వర్మ ఫౌండేషన్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Medak Murder: మైనర్ న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపు.. కట్‌చేస్తే..
