NTV Telugu Site icon

Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు

Sangareddy Crime

Sangareddy Crime

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సంజీవన్‌రావు పేటలో విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నీటిని తాగిన మరో 30 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులంతా స్థానిక సంజీవరావుపేటలోని బావి నీటిని తాగుతున్నారు. నీరు కలుషితం కావడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే బావిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు చెప్పారు. మృతులు మహేష్‌, సాయమ్మగా గుర్తించారు. అధికారులకు ఈ విషయం తెలియడంతో వెంటనే గ్రామంలో హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఎందుకు నిలిపి వేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. బావి నీరు కలుషితంగా వున్నా గతిలేక తాగాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక నిన్న పండుగ రోజు కావడంతో నీరు లేక బావి నీటినే తాగాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. అయితే దీనిపై రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేస్కోండి