Sangareddy: బావి నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులు, విరేచనాలు
- సంగారెడ్డి జిల్లాలో సంజీవన్‌రావు పేటలో విషాదం..
- కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో సంజీవన్‌రావు పేటలో విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నీటిని తాగిన మరో 30 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులంతా స్థానిక సంజీవరావుపేటలోని బావి నీటిని తాగుతున్నారు. నీరు కలుషితం కావడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే బావిలోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు చెప్పారు. మృతులు మహేష్, సాయమ్మగా గుర్తించారు. అధికారులకు ఈ విషయం తెలియడంతో వెంటనే గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఎందుకు నిలిపి వేశారనేదానిపై ఆరా తీస్తున్నారు. బావి నీరు కలుషితంగా వున్నా గతిలేక తాగాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక నిన్న పండుగ రోజు కావడంతో నీరు లేక బావి నీటినే తాగాల్సి వచ్చిందని అంటున్నారు బాధితులు. అయితే దీనిపై రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
HMDA Website: హైడ్రా బారిన పడకూడదంటే.. HMDA కొత్త వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేస్కోండి
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!