K.A.Paul: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిని పరిశ్రమ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసిందని అన్నారు. ఆయన సినిమా వల్ల ఓ మహిళ చనిపోతే 25 లక్షల రూపాయలు బిక్షం వేస్తున్నారా…? అని పేర్కొన్నారు. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? ప్రశ్నించారు. అల్లు అర్జున్ కొడుకు చనిపోతే రూ.25 లక్షలు ఇస్తే ఊరుకుంటాడా..? అని అన్నారు. పుష్ప 2 సినిమాతో వచ్చిన లాభం మొత్తం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు ఓ 20 సినిమాలు చేస్తే.. ఓ సినిమా లాభం ఇస్తే ఏమవుతుందని కేఏ పాల్ అన్నారు.
Mohan Bhagwat: మతం అవగాహన లేకపోవడం వల్లే అణచివేతలు , దౌర్జన్యాలు!
పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా.. తన కొడుకు శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఈ ఘటనలో నటుడు అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం