NTV Telugu Site icon

Sangareddy: ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో దూసుకెళ్తున్న ఉన్నతాధికారుల వాహనాలు..

Sangareddy

Sangareddy

సంగారెడ్డిలో అధికారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి లైన్‌లో పెట్టాల్సిన అధికారులే రూల్స్ తప్పుతున్నారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ చలాన్లను ఎగ్గొడుతున్నారు. ఈ వ్యవహారం సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు.. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వరకు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వాహనంపై ఓవర్ స్పీడ్ చలాన్ ఉంది. అలాగే.. సంగారెడ్డి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ వాహనంపై ఐదు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వాహనంపై ఆరు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. సంగారెడ్డి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ వాహనాలపై చెరో రెండు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి.

Read Also: Ram Charan: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరణే.. అరుదైన గౌరవం

ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చింది. అయినా అధికారులు చలాన్లు కట్టలేదు. 2022 నుంచి అధికారుల వాహనాలపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్‌తో సంగారెడ్డి, మెదక్, సైబరాబాద్ పరిధిలో అధికారుల వాహనాలపై భారీగా చలాన్లు పడ్డాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సామాన్యులకు ఓ న్యాయం, అధికారులకు ఓ న్యాయమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Israel Hezbollah War: హిజ్బుల్లా బంకర్‌లో 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారం.. ఆయువుపట్టుపై ఇజ్రాయిల్ దెబ్బ..