NTV Telugu Site icon

Jagga Reddy: రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడం లేదు..

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి.. కొన్ని విషయాలు ఇప్పుడే షేర్ చేయలేను.. సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అన్నారు. పరిస్థితి చూస్తే ఇబ్బంది అనిపించినా బయటకు చెప్పలేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడటం లేదు.. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది.. ఇంపార్టెంట్ అయితే, సీఎం జోక్యం చేసుకుంటారు అని ఆయన వెల్లడించారు. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్టు ఉంది.. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.. నేను నిర్ణయం తీసుకునే ప్రోటోకాల్ పరిధిలో లేను.. కేవలం పార్టీ పరిధిలో ఉన్నాను అని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

Read Also: Railway Budget For AP: రైల్వే బడ్జెట్‌.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు..

ఇక, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ కి కానీ, పీసీసీ చీఫ్ కి కానీ సలహాలు ఇచ్చే ప్రోటోకాల్ లో లేను అని జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వం బద్నాం కావొద్దు.. పార్టీ ఇబ్బంది పడొద్దు.. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది మాకు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా.. పాలనతో పాటు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలను ప్రభుత్వం కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి.. ఓడిపోయిన వాళ్ళను పార్టీ నాయకత్వం చూసుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.