Sangareddy: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోంది. ఈరోజు (శనివారం) గగన్ పహాడ్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇవాళ తెల్లవారుజాము నుంచి సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపించారు. అమీన్‌పూర్ మండంలోని ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల ఆక్రమిత భూమిని హైడ్రా ఆధికారులు రక్షిస్తున్నారు. సర్వేనెంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్లు చేశారన్న ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది.
Read also: D. Sridhar Babu: కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..
స్థానికు పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ నిర్మాణాలు, సరిహద్దు రాళ్ళను హైడ్రా అధికారులు తొలగించారు. అక్కడ ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించినచో శిక్షార్హులుగా పేర్కొంటామని బోర్డును ఏర్పాటు చేసింది. సర్వే నెంబర్ 119 అంటూ అమీన్‌పూర్ తహశీల్దార్ అనే పేరుతో బోర్డును పెట్టాను. వర్షం పడుతున్నా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 462 సర్వే నంబర్ లోని 18 గుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేశారు హైడ్రా అధికారులు. తనకు సంబంధించిన నిర్మాణాల కూల్చివేతలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేసీబీలు రాకుండా లారీని అడ్డుపెట్టగా బలవంతంగా జేసీబీతో లారీ తొలగించారు.
Read also: CM Revanth Reddy: అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం..
రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి మున్సిపల్ చైర్మన్ దిగారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకే కూల్చివేతలని తహశీల్దార్ రాధా తెలిపారు. పోలీసుల జోక్యంతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెడుతోంది. బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, పెద్ద భవనాలను ఎక్కడికక్కడ ఎఫ్‌టీఎల్ ధ్వంసం చేస్తోంది.
Medak Temple: మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ ఆలయం