Site icon NTV Telugu

Sangareddy: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

Sangareddy

Sangareddy

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను లక్ష్యంగా చేసుకుని నైజిరియన్ల నుంచి నార్కోటిక్స్ డ్రగ్స్ను నగరానికి తరలిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు కోటి పదిహేను లక్షల విలువైన ఎండిఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: UP: కూతురు పెళ్లికి చేయించిన నగలతో తల్లి జంప్.. తండ్రి ఏం చేశాడంటే?

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1కోటి 15 లక్షల విలువైన 1 కేజీ ఎండిఎంఏ, 4 మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి డ్రగ్‌ను డంప్ చేస్తున్నట్లు.. నైజీరియన్స్ జెర్రీ, జిమ్మీ అనే వ్యక్తుల నుంచి డ్రగ్‌ను నిందితులు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also: Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..

10 రోజుల క్రితమే డ్రగ్ తరలింపు.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే భారీగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. డ్రగ్స్ తరలిస్తున్న మహ్మద్ సలీం, ముఖేష్ దూబేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మరో ముగ్గురు డ్రగ్ విక్రేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను నార్కోటిక్స్ ఎస్పీ చైతన్య, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మీడియాకు వెల్లడించారు.

Exit mobile version