మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007లో గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన టీఎస్‌పీఎస్సీ (TSPSC) మెంబర్ గాను పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also: India Republic Day: కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యుడిగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివి అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ముఖ్యమంత్రి.
Read Also: Bollywood : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్ కిడ్స్
మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు హరీష్ రావు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా , తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారు.
బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయం. సత్తన్న గారి… pic.twitter.com/ssA59VObwM— Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2025