NTV Telugu Site icon

Fish Died: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృతి..

Jaggareddy

Jaggareddy

Fish Died: సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇవాళ ఉదయం నుంచి చేపలు భారీగా మృత్యువాత పడ్డాయి. చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకుని చేరువులోని నీటిని శాంపిల్స్‌గా సేకరించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చనిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గుర్రపు డెక్క, డ్రైనేజీ వ్యర్దాలతోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమికంగా నిర్దారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు శాంపిల్స్ సేకరించారు.

Read also: ఈ మొక్క ఇంట్లో ఉంటే అందం, ఆరోగ్యం..!

ఆరు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు డ్రైనేజీ వ్యర్ధాలు చెరువు సమీపంలో వేయొద్దని అధికారులు నోటీసులిచ్చారు. అయినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకుండా వ్యర్ధాలను యధేచ్చగా వేస్తున్నట్లు మత్య్సకారులు మండిపడుతున్నారు. ఇక్కడి చెరువులో సాయంత్రం అయితే చాలు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది వచ్చి పడేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని చెరువును, చేపలను కాపాడలని కోరుతున్నారు. అయితే దీనిపై స్థానిక సమాచారంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెరువుని పరిశీలించారు. గంగపుత్రుల కుటుంబాలతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇక్కడ వ్యర్థాలను పడేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువులోని చేపలను నమ్ముకుని బతుకుతున్న గంగపుత్రులకు తోడుగ ఉంటానని హామీ ఇచ్చారు.
ఎక్కువగా మరిగించిన ‘టీ’ తాగితే..