ప్రస్తుతం వందలో 90 మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది తెగ వెతుకుతున్నారు.

మందులతో కాకుండా నేచురల్ గా ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న అంశం. అలాంటి వారు ఇంట్లో కొన్ని రకాల ఔషధ మొక్కలను పెంచుకుంటే మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.  

కలమందను రణపాల అని కూడా పిలుస్తారు. రణపాల మొక్కను నిరభ్యంతరంగా ఇంట్లో పెంచుకోవచ్చు. ప్రస్తుతం మనం కలబంద మొక్క యొక్క ప్రయోజనాలను కలబంద ఆరోగ్యానికి అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలను తెలుసుకుందాం.

కలబంద ఔషధ మొక్క. కలబందను కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాలలోనూ ఎక్కువగా వాడుతారు. కలబంద మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. జీర్ణశక్తిని పెంపొందించడానికి, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. 

కాలిన గాయాలకు కలబంద రసాన్ని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే మన కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. కలబంద గుజ్జుతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 

కలబందను జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. చుండ్రు తగ్గి జుట్టు నల్లగా మెరిసేందుకు కలబంద ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును ముఖానికి, ఒంటికి రాసుకుంటే ముఖం పైన, చర్మం పైన ఉన్న టాన్ తొలగిపోయి చర్మం నిగారింపు సొంతం చేసుకుంటుంది. 

మార్కెట్ లో కలబంద జ్యూస్, కలబంద జెల్ అందుబాటులో ఉంది, కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ ను తాగితే చాలాకాలం అనారోగ్యాలు దరిచేరకుండా ఉండొచ్చు. 

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలబంద నిజంగా ఇంట్లో ఉండాల్సిన చాలా ముఖ్యమైన మొక్క.