సమంత పరువు నష్టం పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత విడాకుల సందర్భంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్ చేసిన వీడియోలు తప్పుడు ప్రచారాలు చేశాయని తమ పరువుకు భంగం వాటిల్లిందని సమంత కేసు వేశారు. కేసును కూకట్‌పల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోసారి వాదనలు వినిపించిన సమంత తరపు న్యాయవాది బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడారు. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపామన్నారు.
సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చెయ్యడం సరైంది కాదు. తమ పిటీషన్ లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదన్నారు. కేవలం యూ ట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని బాలాజీ చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా ..పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరామన్నారు. గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఈ రోజుతో వాదనలు పూర్తి చేసిన కూకట్‌పల్లి న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసిందని సమంత తరపు న్యాయవాది బాలాజీ తెలిపారు.
Also Read
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!