Site icon NTV Telugu

Sama Ram Mohan Reddy : దళితుల పేరిట లూటీ.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై రామ్మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sama Ram Mohan Reddy, Rs Pr

Sama Ram Mohan Reddy, Rs Pr

Sama Ram Mohan Reddy : తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 240 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి ఏకంగా నాలుగు కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారని, ఇది నమ్మదగిన విషయం కాదన్నా సామా రామ్మోహన్‌ రెడ్డి. మూడు సంస్థల పేరుతో కోడింగ్ శిక్షణ చేపడతామన్నా, కేవలం రెండు సంస్థలకే అనుమతులు తీసుకున్నారు అంటూ మండిపడ్డారు.

CDS Anil Chauhan: మా దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది..

ఈ-టెండర్ ప్రక్రియ చేపట్టకుండా కోర్సులకు ఖర్చులు చేసినట్టు రామ్మోహన్ ఆరోపించారు. “ఐఐటీ, జేఈఈ ఆన్‌లైన్ కోర్సుల పేరుతో రూ. 20 కోట్లు ఖర్చు చేశారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు విడుదలయ్యాయి” అని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా లక్షా ఇరవై వేల మందికి ఉచితంగా కోడింగ్ శిక్షణ ఇస్తున్నామని, ఇది ప్రభుత్వం చేపట్టిన పారదర్శక కార్యక్రమమని వివరించారు.

ఈ ఆరోపణలన్నీ కేంద్రం క్యాగ్ నివేదికలో పేర్కొన్న విషయాలేనని తెలిపారు. దళిత విద్యార్థుల పేరుతో భారీగా నిధులు మళ్లించారని, అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ, ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వమే విజిలెన్స్ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు.

ఇతర అంశాలపై కూడా ఆయన స్పందించారు. గత పదకొండు ఏళ్లలో ఎస్సీ గురుకులాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ సాధించలేకపోయారని, ప్రస్తుతం మాత్రం అన్ని సీట్లు భర్తీ అవుతున్నాయని తెలిపారు. యూనిఫాం, దుప్పట్ల వంటి అవసరమైన సదుపాయాలనూ మరవకుండా ప్రవీణ్ వదిలి పెట్టలేదని విమర్శించారు.

IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!

Exit mobile version