Site icon NTV Telugu

Breaking : శవమై కనిపించిన దత్తపుత్రుడు సాయితేజ

నల్లమల్ల అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థం జలపాతం వద్ద వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది.. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందినా సాయి తేజ చెడు అలవాట్లకు బానిసై, తనను పెంచిన తల్లి భూలక్ష్మిని ఈ నెల 6వ తేదీన అతికిరాతకంగా హతమార్చాడు.. అంతేకాకుండా.. ఇంట్లో సొమ్ములు, డబ్బులు తీసుకొని అతని స్నేహితుడు వట్టికోట శివతో కలిసి 10వ తేదీన శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మల్లెలతీర్థం జలపాతానికి వెళ్లి అక్కడ మద్యం సేవించారు.. ఇరువురి మధ్య జరిగిన ఘటనలో శివ, సాయి తేజ్ ను కిరాతకంగా చంపి కాళ్ళు, చేతులు కట్టేశాడు.

అనంతరం లగేజ్ బ్యాగును రాళ్లతో నింపి సాయి తేజ్ మృతదేహాన్ని బ్యాగ్ కు కట్టి జలపాతం ఎదురుగా ఉన్న కుంటలో పడేశాడు.. ఆ తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వివరాలతో అమ్రాబాద్ పోలీసులు, ఫారెస్ట్ అధికారుల సహకారంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు..ఈ దర్యాప్తులో సరూర్ నగర్ పోలీసులు, అమ్రాబాద్ పోలీసులు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version