NTV Telugu Site icon

Praja Sangrama Yathra: ముగింపు సభ.. హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి..?

Bandi Sanjay Mugimpusabha

Bandi Sanjay Mugimpusabha

తెలంగాణ రాష్ట్ర BJP అధ్యక్షులు, కరీంనగర్ MP బండి సంజయ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత ముగింపు సభ నేడు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దఅంబర్ పేటలో జరగనున్న ఈ సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నారు. సాధ్వి నిరంజన్ జ్యోతికి బీజేపీలో మంచిపేరు ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నియోజకవర్గం నుంచి సాధ్వి నిరంజన్ ఎంపీగా గెలిచారు. దీంతో ఆమెను ప్రధాని మోడీ కేంద్రమంత్రిని చేశారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని ఇప్పటికే నేతలకు పార్టీ సూచించింది.

Read also:Thursday Sai Chalis Parayanam Live: గురువారం సాయి చాలీసా వింటే..

రాష్ట్రంలో ఏ స్కామ్ చూసినా KCR కుటుంబం పాత్ర ఉందని రాష్ట్ర BJP చీఫ్ బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తన కుమార్తె, కుమారుడు ఎవరు తప్పు చేసినా జైల్లో పెడతానన్న KCR.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో CBI, ED దాడులు చూసి.. KCR ఫ్యామిలీ క్వారంటైను వెళ్లక తప్పదన్నారు. రాష్ట్రంలో MIM ఆగడాలకు బీజేపీ మాత్రమే అడ్డుకట్టవేయగలదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు RRR వద్దంటూ రాయగిరికి చెందిన ప్రతినిధుల బృంద సభ్యులు బండి సంజయ్కు వినతి పత్రం ఇచ్చారు. RRR అలైన్మెంట్లో మార్పు చేయాలని వారు కోరారు. ప్రస్తుత రోడ్డు భువనగిరి మున్సిపాలిటీని రెండుగా చీల్చుతుందని, రాయగిరి అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉందని సంజయ్కు వివరించారు.
Kadambari Kiran Birthday Special : శభాష్ కాదంబరి కిరణ్!