Site icon NTV Telugu

Sabitha Indra Reddy: ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి సబిత సమీక్ష.. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశం

Sabitha Indra Reddy Meetng

Sabitha Indra Reddy Meetng

Sabitha Indra Reddy Review Meeting On Intermediate Education: మంగళవారం ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కాలేజీల్లో అవసరమైన కొత్త భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసినా.. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాలేజీ నిర్వహణ అవసరాలు, ల్యాబ్‌ల ఆధునికీకరణ పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని.. ఈ పనులన్నీ వెంటనే చేపట్టాలని చెప్పారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై కూడా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో.. శుక్రవారం నాటికి పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయాలని సూచించారు.

Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్

ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్ని మంత్రి సబిత ఖండించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ రాష్ట్రంలోనే ఉచితంగా అందిస్తున్నామని.. ప్రవేశాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కెజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్‌గ్రేడ్ చేశామని అన్నారు. వీటిలో కొంతమంది విద్యార్థులు చేరారన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. అయితే.. మారుమూల జిల్లాల్లో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

Suicide Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు

Exit mobile version