Rythu Bandhu in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌కు పెట్టుబడి సాయం కింద నేటి నుంచి రైతుబంధు నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఎకరం పొలం ఉన్న రైతుల నుంచి మొదలు పెట్టి సంక్రాంతి సందర్భంగా రైతులందరి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. నేటి నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుండగా, రైతుబంధు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7,676 కోట్ల నిధులను విడుదల చేసింది. దాదాపు 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందజేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 15లోపు రైతులందరి ఖాతాల్లో గతంలో జమ చేసిన విధంగా ఎకరం నుంచి నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కోతలు లేకుండా పూర్తిగా అందించాలని సూచించారు.
Read also: Bhakthi Live: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
కేసీఆర్ ఆదేశాలతో బుధవారం నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండెకరాల లోపు పొలాలు ఉన్న రైతులకు డబ్బులు అందుతాయని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. సెస్ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఆ జిల్లా రైతులకు నగదు అందింది. కరీంనగర్ జిల్లా రైతులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 7 వరకు అవకాశం కల్పించారు. జిల్లాలో కొంతమంది కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందుకోగా.. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. కొత్త దరఖాస్తుదారులకు కూడా ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. యాసింగ్ సీజన్ కు ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది.
నేటి నుంచి రైతుబంధు డబ్బులు వస్తుండటంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు అందజేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోకీ ఇదే అత్యంత కీలకమైన పథకం అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కూడా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంత కాలం రైతుబంధు పథకం ఆగదని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు తొమ్మిది విడతల డబ్బులు అందించారు.
2022 Filmy Rewind: అభిమానులను విడిచి దివికేగిన తారలు!
