NTV Telugu Site icon

Rythubandhu: రెండో రోజు 16.32 లక్షల మంది రైతులకు జమ

Rythubandhu Scheme

Rythubandhu Scheme

రైతుబంధు పథకం కింద 9వ విడతలో ఈ రెండు రోజుల్లో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు రూ.1820.75 కోట్లు జమ అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాలు ఉన్నవారు అత్యధికంగా 92.50 శాతం మంది రైతులు ఉన్నారని పేర్కొన్నారు. పదెకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు మొత్తంగా అందిస్తోంది కేవలం రూ.250 కోట్లు మాత్రమేనని చెప్పారు.

విడతల వారీగా లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తామని నిరంజన్‌ రెడ్డి తెలిపారు. రెండో రోజు 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేశామన్నారు. వారికి చెందిన 24.68 లక్షల ఎకరాలకు రూ.1234.10 కోట్లు ఇవాళ జమ అయ్యాయన్నారు. రైతుబంధు పథకం కింద 9వ విడతలో 65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం రైతుబంధుకు అర్హులు 68.10 లక్షల మందిగా తేలారన్నారు.రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతోందని పేర్కొన్నారు. తొలిరోజు 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు రూ.586.65 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయన్నారు. గత ఎనిమిది విడతలలో రూ.50.448 కోట్ల సాయం రైతులకు అందిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.