సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్ పై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. 11 మందికి గాయాలయ్యాయి. ఏడుగురు రూబీ హోటల్ నుండి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సహాయంతో 17 మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది. హాస్పిటల్లో ఉన్నవారికి ఇంటర్నల్ గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో సెల్లార్లో 28 ఎలక్ట్రిక్ బైకులు,8 పెట్రోల్ బైక్ లు వున్నట్టుగా తెలుస్తోంది. అదే సెల్లార్లో జనరేటర్లతోపాటు ఓపెన్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో బైకులు, జనరేటర్, బ్యాటరీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మంటలు అంటుకున్న కాసేపట్లోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. సీసీ టీవీ ఫుటేజ్ లో అనేక అంశాలు బయటపడ్డాయి. వీటితోపాటు నాలుగు హెచ్ పి సిలిండర్లు లీకేజ్ కండిషన్లో ఉన్నాయి. బిల్డింగ్ రూఫ్ టాప్ పైన కిచెన్ సదుపాయం వుంది.
Read Also: Ruby Hotel Fire Accident: రూబీ హోటల్ విషాదం..ఫైర్ డిపార్ట్ మెంట్ నివేదికలో ఏముందంటే?
ఈఘటనపై 304(2), 324 , ఎక్స్ ప్లోసివ్ యాక్ట్ సెక్షన్ 9 కింద కేసు నమోదు చేసారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 8 మృతదేహాలకు గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. నిందితులు రంజిత్ సింగ్, సునీత్ , సుదర్శన్ నాయుడు, జస్పాల్ సింగ్ లను అరెస్టు చేశారు. పరారీలో సుప్రీత్ సింగ్ వున్నట్టు పోలీసులు తెలిపారు. రూబీ హోటల్ బిల్డింగ్ రంజిత్ సింగ్ పేరు మీద ఉంది.
రంజిత్ సింగ్ కుమారులు సునీల్ సింగ్ సుప్రీత్ సింగ్. బైక్ చార్జ్ అవుతున్న క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఎఫ్ఎస్ఎల్ నుండి పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని, వచ్చాకే కీలక అంశాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. బ్యాటరీ చార్జింగ్ బైక్స్ బిజినెస్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ ను నిందితులు పాటించలేదని తెలుస్తోంది. నిందితుల కారణంగానే ఇంత భారీ ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ పార్కింగ్ ప్లేస్ ని దుర్వినియోగం చేసి చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
