Site icon NTV Telugu

RSS Plans: తెలంగాణలో విస్తరించే ప్లాన్

తెలంగాణలో విస్తరించేందుకు పావులు కదుపుతోంది ఆర్‌ఎస్‌ఎస్‌. వచ్చే మూడేళ్లలో 25శాతం గ్రామాల్లో విస్తరించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది. అందుకు గల అవకాశాలను వినియోగించుకుంటూ సభ్యత్వం పెంచుకోవాలని భావిస్తోంది.

దేశవ్యాప్తంగా RSS శాఖలు పెరుగుతున్నాయ్‌. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం 60 వేల 929 శాఖలు దేశంలో యాక్టివ్‌గా ఉన్నాయ్‌. తెలంగాణలో కొత్తగా 175 గ్రామాలలో శాఖలు ఈ ఏడాది ప్రారంభమయ్యాయి.2024కి RSS ఏర్పడి వంద సంవత్సాలు పూర్తవుతుంది. ఆ లోపు తెలంగాణలోని ప్రతి 5 గ్రామాలకు ఒక గ్రామంలో సంఘ శాఖ ప్రారంభించాలనే టార్గెట్‌ పెట్టుకుంది RSS. పట్టణ ప్రాంతాల్లో 10 వేల జనాభాకు ఒక శాఖ ఉండాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 43 గ్రామాల్లో గ్రామీణ వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

https://ntvtelugu.com/maheshkumar-goud-warning-rebel-leaders/

తమ సంస్థ పట్ల ఆదరణ పెరుగుతుందని ప్రజలు జాతీయవాద భావాలవైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు. శాఖల్లో సంఖ్య పెరగడం, కొత్తవాళ్లు సంస్థలో చేరేందుకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శమంటున్నారు. ఉత్తారాది రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న .. ఆర్‌ఎస్‌ఎస్‌.. మరి తెలంగాణలో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Exit mobile version