Site icon NTV Telugu

Mohan Bhagwat : రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ మన ప్రతి కార్యకర్తలో ఉంది

Mohan Bhagwat

Mohan Bhagwat

 

తెలంగాణలో ఏబీవీపీ ప్రాంత కార్యాలయం అద్భుతంగా నిర్మించారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. హైదరాబాద్ లోని తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల స్వప్నం, నిష్టతో ఈ భవనం సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. తెలంగాణ ఏబీవీపీ కార్యకర్తల త్యాగానికి ప్రతీక ఈ భవనమని, ఒకప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే సరస్వతిని పూజిస్తాడు అనేవారు కానీ ఇప్పుడు ఆ కార్యకర్తకు అఖండ దేశమే దైవం అనే మార్పు వచ్చిందన్నారు. రాజుల కాలం, అంతకంటే ముందు నుంచి ఎంతో మంది వచ్చారు పోయారు.

కొంతకాలం గుర్తుఉంటారని, కానీ రాముడు 8 వేల సంవత్సరాల తరువాత కూడా పూజలు అందుకుంటున్నారన్నారు. రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ మన ప్రతి కార్యకర్తలో ఉందంటూ.. ఇతిహాస కథతో ఏబీవీపీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు. తండ్రి వ్యాఖ్య పరిపాలన చేసిన వారిని 8 వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని, మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని మోహన్‌ భగవత్‌ అన్నారు. యూపీలో ఇప్పటికీ కొన్ని మైళ్ల దారిలో ఎవరూ నడవరని, ఎందుకంటే సీతాదేవి పాదయాత్ర చేసే సమయంలో కాళ్ల నుంచి రక్తం వచ్చిందని.. అందుకే ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేయరని మోహన్‌ భగవత్‌ వెల్లడించారు.

Exit mobile version