NTV Telugu Site icon

BANDI SANJAY : RRRపై బండి సంజ‌య్ ప్రశంసలు.. టీబీజేపీ చీఫ్ ట్వీట్ ‌పై నెటిజన్స్ ఫైర్

Bandi Sanjay

Bandi Sanjay

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు సినిమా ఘనత విశ్వవ్యాప్తమైందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో ఈ మూవీను తీవ్రంగా వ్యతిరేకించే థియేటర్లు కాల్చివేస్తాం.. తగలబెడతాం.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని ఉద్దేశించి బిడ్డ నువ్వు కనుక సినమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని ఈ మూవీ మీద వివదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సినిమా యూనిట్, డైరెక్టర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

Also Read : Prem Rakshith: డ్యాన్స్ వేసినవారినే కాదు.. నేర్పించినవారిని కూడా లేపండయ్యా

గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోలను షేర్ చేస్తూ.. ఇలాంటి చిల్లర పాలిటిక్స్ మానుకోవాలని హెచ్చరించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి వ్యక్తి బండి సంజయ్ అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. బండి సంజయ్ చేసిన ట్వీట్ ను కొందరు రీట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి బెదిరింపు రాజకాయాలు మానుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద సినిమాకు అవార్డు రావడం ఎంత ట్రెండింగ్ గా మారిందో.. బండి సంజయ్ వైఖరిని నిరసిస్తూ నెటిజన్స్ రియాక్ట్ అవుతుండటంతో ట్రెండింగ్ గా మారింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం పట్ల భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

Also Read : PAK : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పాక్ లో ప్రాయాణికుడు మృతి

Show comments