NTV Telugu Site icon

Warangal: కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త

Warangal

Warangal

Warangal: వరంగల్ నగరం లోని స్టార్ హోటల్ లో లొట్టలు వేసుకుంటూ తింటున్నారా.. మీరు తినే తిండి కుళ్లిపోయిందేమో ఒక్క సారి చూసుకోండి. అవును మీరు విన్నది నిజమే. హనుమకొండ నగరంలో పేరు ఉన్న స్టార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడ్డ నిజం ఇది. హనుమకొండ పట్టణంలోని అశోక.. శ్రేయ.. అరణ్య.. హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కాగా.. పలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా, చూస్తేనే వాంతులొచ్చే పరిస్థితులు కనిపించాయి. కుళ్లిపోయిన మాంసం, ప్రమాదకరమైన రంగులు కలిప, నాన్ వెజ్ పరిశుభ్రత లేని కిచెన్ వారి తనిఖీల్లో బయటపడింది. దీంతో స్టార్ హోటల్ పై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.

Read also: Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!

హనుమకొండలోని అరణ్య, జంగిల్‌ థీమ్‌ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా, ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం రిఫ్రిజిరేటర్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచలేదని, చికెన్‌, మటన్‌లను ఫుడ్‌ గ్రేడ్‌ కాని ప్లాస్టిక్‌ కవర్లలో భద్రపరిచినట్లు గుర్తించారు. ఇది కాకుండా, హానికరమైన రసాయనాలు కలిపిన చీజ్, తుప్పు పట్టిన వంట పాత్రలు మరియు బూజుపట్టిన కూరగాయలు కనిపించాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అరణ్య జంగిల్ రెస్టారెంట్ యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు రెస్టారెంట్‌లో నిల్వ ఉంచిన 26 కిలోల చికెన్‌ వెరైటీలను విసిరేసి, ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చట్టం కింద సంబంధిత యజమానికి నోటీసులు కూడా జారీ చేశారు. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది.

Read also: Hair Cutting: ఇష్టం లేని కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య

దీంతో చికెన్ కబాబ్ లు, ఇతర రకాలు బూజు పట్టి అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్‌ యాజమాన్యానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ చట్టం కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 11 కిలోల బూజు పట్టిన చికెన్, ఫిష్ టిక్కా, ఇడ్లీ పిండి, బొద్దింకలు వేసిన బెల్లం పారేశాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఆహారంలో నాణ్యత లోపించడంతో సంబంధిత యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో ఉంచిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నమూనా నివేదికల ఆధారంగా సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రత అధికారులు హెచ్చరించారు. హోటల్ యజమానులకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
US: నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా నిలిచిన 12 ఏళ్ల ఎన్నారై బాలుడు