Site icon NTV Telugu

రోశయ్య మరణం కాంగ్రెస్‌ నేతలను కలిచి వేసింది: షబ్బీర్‌ అలీ

రోశయ్య మరణం కాంగ్రెస్‌ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్‌ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్‌ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్‌ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ శ్రేణులు నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా చూడ్డానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. హైదరాబాద్ లో రోశయ్య మెమోరియల్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని షబ్బీర్‌ అలీ అన్నారు. ఇవ్వాల జరిగిన ఈ సమావేశంలో ఈ తీర్మానం చేశామని తెలిపారు. మా తీర్మానం సీఎం కేసీఆర్ కు అందజేస్తామని వెల్లడించారు. రోశయ్యకు భయపడి ఎన్టీఆర్‌ కౌన్సిల్‌ రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు.

రోశయ్య కుటుంబం మాకు మొదటి నుండి పరిచయం: గీతారెడ్డి

రోశయ్య కుటుంబం మాకు మొదటి నుండి పరిచయమని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. నా దగ్గరికి రెగ్యూలర్‌గా రోశయ్య కుటుంబ సభ్యులు మెడికల్‌ చెకప్‌ కోసం నాదగ్గరికి వచ్చేవారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్య 50 ఏళ్లు సేవలందించారని ఆమె కొనియాడారు. ఆర్థిక శాఖ మంత్రిగా రోశయ్యకు మంచి గుర్తింపు వచ్చిందని ఆమె అన్నారు. ఎవరికీ కీడు చేయని వ్యక్తి రోశయ్య అన్నారు. కొంపల్లిలోని ఫాం హౌస్‌లో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని గీతారెడ్డి వెల్లడించారు.

Exit mobile version