NTV Telugu Site icon

కూకట్‌పల్లిలో పట్టపగలే దారి దోపిడీ

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం సృష్టించింది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారికి కత్తి చూపించి బెదిరించిన దుండకులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు అగంతకులు వ్యాపారిపై దాడి చేసి జేబులో నుంచి డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.