NTV Telugu Site icon

Roads Problem: ఏజెన్సీ ఏరియాల్లో కనిపించని ప్రగతి

Adb 1

Adb 1

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వున్నా.. అడవులు, కొండలు, గుట్టలు ఎక్కువగా వుండే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం కష్టంగా నడుస్తోంది. పల్లె ప్రగతి కోసం వెళ్ళిన అధికారులకు రోడు కష్టాలు కళ్ళకు కట్టాయి. వారంతా నడవలేక, కొండలు దాటలేక నానా కష్టాలు పడాల్సి వచ్చింది. మారు మూల ఏజెన్సీ ప్రాంతాలోని గుట్ట లెక్కి మరీ కార్యక్రమం నిర్వహించారు.

బండ రాళ్ళు, కొండ గుట్టల మధ్య నుండి గ్రామానికి వెళ్ళారు. కొమురం భీం జిల్లాలో అధికారులు ప్రజా ప్రతినిధుల కష్టం అంతా ఇంతా కాదు. కొమురం భీం జిల్లా తీర్యాని మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అక్కడికి జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ, అధికారుల బృందం పర్యటించింది. తిర్యాని మండలంలోని మారుమూల గ్రామాలైన గుండాల, రొంపల్లి గ్రామాలలో 5 వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారు,

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, భవిష్యత్తులో అన్ని విధాల సదుపాయాలు గుండాల గ్రామస్తులకు అందే విధంగా చూస్తానని జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. మొత్తానికి పల్లె ప్రగతికి వచ్చిన అధికారులకు చుక్కలు కనిపించాయి. రోడ్డు సౌకర్యం సరిగా లేక అక్కడి పిల్లలు సరైన చదువుకు దూరం అవుతున్నారు. గర్భిణీలైతే పురుటి నొప్పులు వస్తే మాత్రం ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ప్రసవం కోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీకావు.

Kollapur TRS: తగ్గేదెలే అంటున్న కొల్లాపూర్ గులాబీ నేతలు