Site icon NTV Telugu

Crime News: ఘోరం.. బైక్ ను ఢీకొట్టిన వాహ‌నం.. ముగ్గురు మృతి

Ghatkeser Accident

Ghatkeser Accident

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్నిన్ ను ఎవర్ టెక్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడిపించడం, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరగుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా యూటర్న్ ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య .. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి 12 గంటల వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రమాదాలు జరగకుండా ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా మనం జాగ్రత్తగా వున్నా మన ఎదుటువారు వచ్చే స్పీడికి బ్రేక్ లేకుండా పోతుంది. దాంతో ప్రాణాలు గాల్లో కాలుస్తున్నాయి. ఇలాంటి ఘటన హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో చోటుచేసుకుంది.

ఘట్‎కేసర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిపై బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారంతో ఘట్ కేసర్ పోలీసులు అక్కడకు చేరుకుని క్ష‌తగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. వారు ముగ్గరు ఎవరు అనేది విచారిస్తున్నాట్లు తెలిపారు. బైక్ పై వీరు ఎక్కడకు వెలుతున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం కోసం సీసీ ఫోటేజ్ ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Astrology: జూన్ 23, గురువారం దినఫలాలు

Exit mobile version