Site icon NTV Telugu

Road Accident: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం…

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైమవతి (25), నాగరాణి(23) అనే ఇద్ద‌రు యువ‌తులు గచ్చిబౌలి DLF వద్ద నివాసం ఉంటున్నారు. నాగ‌రాణి ఓప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది. నిన్న రాత్రి హైమవతి ,నాగరాణి ఇద్దరు ద్విచక్ర వాహనంపై DLF నుండి గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్తుండగా అతివేగంగా వ‌చ్చిన కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో నాగ‌రాణికి తీవ్ర ర‌క్త‌స్రావ్యం కావ‌డంతో.. అక్క‌డిక‌క్కడే మృతి చెందగా.. హైమవతి కి తీవ్ర గాయాల‌య్యాయి. స్థానిక స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు హైమవతి ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కేసున‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read Also: TRS Vs Congress: సీతక్కపై కాంగ్రెస్ ట్వీట్ .. టీఆర్ఎస్ కౌంటర్‌

Exit mobile version