Road Accident: చైతన్యపురిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటలకు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణకు చెందినదిగా గుర్తించారు. కారును ఎమ్మార్వో కుమారుడు సాయి కార్తీక్ నడుపుతున్నట్లు దర్యాప్తులో వివరించారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి,సాయి కార్తీక్ తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్త పేట ఓమ్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. యువకులకు తీవ్ర గాయాలు కావడంతో అందరూ అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చైతన్య పురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Dawood Ibrahim : వాంతులు – 102 డిగ్రీల జ్వరం… దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఎలా ఉందంటే ?
చైతన్యపురి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి పేరు విశాల్ గా గుర్తించారు. రాజీవ్ గాంధీ నగర్ కమాన్ దగ్గర ఉన్న ఓ పార్టీకి చెందిన దిమ్మెపై విశాల్ కూర్చున్నాడని.. అయితే.. కారు ఒక్కసారిగా దిమ్మెదగ్గరకు వచ్చి ఢీ కొట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన కారు వేగానికి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో విశాల్ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబానికి ఆసరాగా వుంటారనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు వాపోయారు. కుటుంబానికి దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళల్లో తాగాలి అంతే గాని తాగి ఇలా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలు చేస్తే ఎవరిది బాధ్యత అంటూ మండిపడ్డారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రోడ్ల పై వాహనాలను నడపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..