Site icon NTV Telugu

Road Accident at Madapur: డివైడర్ ని ఢీ కొట్టి కారు.. నెంబర్ ప్లేట్ తో నిందితుడు పరార్..

Road Accident At Madapur

Road Accident At Madapur

Road Accident at Madapur: ప్రదం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ప్రమాదాలు జరగకుండా అధికారలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. మద్యం మత్తులో కారు నడపకూడదని చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఈ తరహా ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కానీ.. దాని ద్వారా వారు జైలు పాలు అవుతారని మాత్రం మరుస్తున్నారు. మరి కొందరైనా అతి తెలివి ఉపయోగింది. ప్రమాదం చేసి ఏమీ ఎరగ నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రమాదాలు చేసి అందులో వారి ప్రమేమం లేనట్టు పోలీసులకు తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇలాంటి ఘటనే మన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. కారు డివైడర్లు ఢీకొట్టడమే కాకుండా కారు నెంబర్ ప్లేట్ తో ఉడాయించాడు.

ఇక వివరాల్లోకి వెళితే.. హైటెక్ సిటీ నోవటెల్ దగ్గర అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. డివైర్‌ ను అతివేంగంగా ఢీకొట్టడంతో.. కారు బోల్తా పడింది. మద్యం మత్తులో వుండి కారు అతి వేగంగా.. నడిపినట్లు సమాచారం. కారులో ప్రయాణిస్తున్న యువతి, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారికి అక్కడే ఇద్దరికీ సపర్యలు చేసారు. అయితే నిందితుడు కారు నెంబర్‌ ప్లేట్‌ వుడాయించాడు. కానీ తను చేసింది తప్పేంటో తనకే తెలియలేక పోయింది. నిందితుడు తప్పించుకున్నాడు అనుకున్నాడనే భ్రమలో వుండిపోయాడు. పాపం ఆ నెంబర్‌ ప్లేట్‌ అతికించడంతో అక్కడే కొంచమైనా నెబర్లు కనిపిస్తాయని గమనించలేక పోయాడు పాపం నెంబర్ AP 28 DX 4376… వోక్స్ వాగన్ పోలో కారు వుంది. దొరకి పోకుండా పోలీసులకే మాయం చేద్దామనుకున్నాడు కానీ, ఎట్టకేటకు కారు నెంబర్‌ సహాయంతో దొరికిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బరిలోకి దిగిన పోలీసులు ఆ కారు నెంబర్‌ సహాయంతో నిందితున్ని వెతికే పనిలో పడ్డారు. గాయపడిన వారి ఎవరు, ఎక్కడ చికిత్స పొందుతున్నారు అన్న వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు.
Indias National Cinema Day: మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.75కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్‌

Exit mobile version