Site icon NTV Telugu

Agnipath Protest: సికింద్రాబాద్‌ విధ్వంసంపై స్పందించిన రేవంత్‌

Revanth1234

Revanth1234

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. అయితే ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది అని మండిపడ్డారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని ట్వీటర్ వేదికగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం, పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కాగా.. హైద‌రాబాద్‌ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

Agneepath Scheme: దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు.. రైళ్లకు నిప్పు పెట్టిన నిర‌స‌న‌కారులు

Exit mobile version