జమునా హాచరీస్‌లో ముగిసిన తొలిరోజు సర్వే.. ఒకే సర్వే నంబర్‌పై గురి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమునా హాచరీస్ తొలిరోజు రెవెన్యూ అధికారుల సర్వే ముగిసింది… అచ్చంపేటలోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన జమునా హాచరీస్‌లో ఇవాళ ఉదయం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే కొనసాగింది.. మొదటి రోజులో భాగంగా 130 సర్వే నెంబర్లోని భూములపై సర్వే చేశారు రెవిన్యూ అధికారులు.. ఇక, రెండో రోజులో భాగంగా బుధవారం రోజు 77, 78, 79, 80, 81, 82 సర్వే నెంబర్లలోని భూమిలోని సర్వే చేయనున్నారు రెవెన్యూ అధికారులు.. అయితే, ఈ సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను మూడుల రోజుల తర్వాత ఇవ్వనున్నారు అధికారులు..
ఇక, జమునా హాచరీస్‌లో తొలిరోజు జరిగిన సర్వేపై మీడియాతో మాట్లాడిన మాసాయిపేట తహశీల్దార్ మాలతి… మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని 130 సర్వే నెంబర్లో ఈరోజు సర్వే పూర్తి అయ్యిందన్నారు.. 11 మంది రైతులకు సంబంధించిన మొత్తం 18 ఎకరాల్లో ఈ సర్వే కొనసాగిందన్న ఆమె… పూర్తి వివరాలను ఈ నెల 18వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. కాగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తర్వాత టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్‌కు ఉప ఎన్నికలు రావడం.. ఆయన మళ్లీ విజయం సాధించడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత.. మరోసారి ఈటల భూములపై ఫోకస్ పెట్టారు రెవెన్యూ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సర్వే చేపట్టిన సంగతి విదితమే.
Also Read
- Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
- KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Tags
తాజావార్తలు
-
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!