తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
“మొసలి కన్నీరు” కార్చడం మీ నాయకత్వ ప్రావీణ్యం.
ప్రధాని మోదీ తెలంగాణ తల్లిని, మన అమరవీరుల త్యాగాలను అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ ను ఎప్పుడూ నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని నరేంద్రమోడీ అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతలు పదే పదే కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారని ….ఆ సమయంలో మీ పార్టీకి మద్దతుగా కేసీఆర్ మాట్లాడారని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఖండించారని కవిత ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఇలా కౌంటరిచ్చారు.
