Revanth reddy: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పోలీస్ ఉద్యగోల భర్తీలో వయోపరిమితిని పెంచాలని కోరతూ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్లో వయో పరిమితిన సడలింపు ఇవ్వాలని సీఎంను కోరారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యం అవ్వడం వల్ల వయోపరిమితితో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆస్క్ కేటీఆర్ లో అభ్యర్థులు అడిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో అలసత్వం చూపించడం వల్ల చాలా మంది అభ్యర్థుల ఏజ్ బార్ అయిపోయిందన్నారు.
ఇప్పుడు మీ ప్రభుత్వం 17 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని.. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయని.. మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని లేఖలో విమర్శించారు. నాలుగేళ్ల తరువాత నోటిఫికేషన్ రావడం, కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని…దీంతో చాలా మంది ఉద్యోగార్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారని.. అయితే ప్రభుత్వ మూడేళ్లు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో నాలుగు లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరం అయ్యారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Also Read
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
- Hyderabad: మియాపూర్‌లో విషాదం..! ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.!
యూపీఎస్సీ భర్తీ చేసే ఐపీఎస్ పోస్టులతో పాటు పలు రాష్ట్రాల యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 32 ఏళ్లుగా ఉందని…. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 5 ఏళ్లు వయోపరిమితి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆస్క్ కేటీఆర్ లో సమస్యను విన్నవించుకున్నా స్పందించలేదని… హోంశాఖ చూసే మంత్రి ఉన్నాడో లేదో తెలియదని.. మీరేమే ఇవన్నీ పట్టనట్లు ఫామ్ హౌజ్ లో సేద తీరుతున్నారని సీఎం కేసీఆర్ ను లేఖలో విమర్శించారు.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?