Site icon NTV Telugu

సీఎం రిలీఫ్ ఫండ్ తో ధాన్యం కొనుగోలు చేయాలి : రేవంత్ రెడ్డి

పీసీసీ అధ్యక్షులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం రేవంత్ రెడ్డి… వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ‌ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నాడు… ఇక్కడ కేసీఆర్ అదే చెపుతున్నాడని ఫైర్ అయ్యారు.

సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంత వరకు ఏ కేంద్ర మంత్రి దగ్గర అపాటిమెంట్ తీసుకోలేదని మండిప‌డ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రి కార‌ణంగా… తెలంగాణ రైతులు చ‌నిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కరోనా సమయంలో తెలంగాణ‌లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

Exit mobile version