టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి రేవంత్ నిప్పులు చెరిగారు. చివరి దాకా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లే తన బంధువు అని..కష్టపడ్డ వాడే తనకు బంధువు అని పేర్కొన్నారు. మరో 20 నెలలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి పని చేయాలని కోరారు. అధికారం లోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేసిన కార్యకర్తల కే పదవులు అని పేర్కొన్నారు.
read also : కర్నూలు జిల్లా వైసీపీలో వారసుల హవా!
ఉప ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ పథకాలు అమలు చేస్తారని.. 118 నియోజకవర్గాల దళితులకు న్యాయం చేస్తారా..? లేదా ? అని నిలదీశారు. ఓట్లు అడుక్కునేది ఉంటే తప్పా… పథకాలు కొత్తవి రావన్నారు. ఆగస్ట్ 9 నుండి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా నిర్వహిస్తామన్న ఆయన.. ఇంద్రవెల్లి నుండి దళితుల దండోరా మోగిస్తామన్నారు. లక్ష మందితో దళిత దండోరా మోగిస్తామని.. ఆదిలాబాద్ నుండే దండోరా మొగిస్తామని తెలిపారు రేవంత్.