Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. BRS ఉప ఎన్నికలు వచ్చాయి.. మా MLA చనిపోయారు… ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి పీజేఆర్ అన్నారు. పీజేఆర్ ఆడబిడ్డల కోసం కృష్ణ జలాలు హైదరాబాద్ తీసుకువచ్చారని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది పీజేఆర్ అని రేవంత్ రెడ్డి. అలాంటి పీజేఆర్ చనిపోతే.. ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా పీజేఆర్ కుటుంబానికి మద్దతు ఇచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం.. సెంటిమెంట్ లేదు.. ఏకగ్రీవం ఇచ్చేది లేదని పీజేఆర్ కుటుంబం మీద పోటీకి పెట్టారన్నారు. పీజేఆర్ కుటుంబంనీ కేసీఆర్ తన ఇంటి ముందు మూడు గంటలు కూర్చోపెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘పాలేరులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోతే.. నారాయణపేట లో కృష్ణారెడ్డి చనిపోతే పోటీ పెట్టింది కేసీఆర్ కాదా.. ఆనాడు చేసిన తప్పులకు బీఆర్‌స్ నేతలు క్షమాపణ చెప్పాలి. ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డానే.. నీ సొంత చెల్లెలి కి వాటా ఇవ్వాల్సి వస్తుంది అని. చెల్లిని బయటకు పంపిన కసాయి కేటీఆర్ కాదా..? సొంత చెల్లెల్ని బయటకు గెంటేసి నీచుడు కేటీఆర్.. మీ సొంత అన్న ఇట్లనే అవమానిస్తే.. ఊరుకుంటారా..? వేలకోట్లు కొల్లగొట్టుకున్న వ్యక్తి కేటీఆర్.. పావలా వంతు అయినా.. చెల్లికి ఇవ్వచ్చు కదా.. మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు.. ఐదేళ్లు మంత్రి పదవులు ఇవ్వకుండా అవమానించిన ది నువ్వు కాదా..? ఇందిరాగాంధీ దేశాన్ని… కాంగ్రెస్ పార్టీ నీ నడపలేదా..? సోనియా గాంధీ.. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నీ నడపడం లేదా..? పదేళ్లలో ఈ పనికి మాలిన వాడు రేషన్ కార్డు ఇచ్చాడా..? ఫార్మ్ హౌస్ లో మీరు ఏమైనా వాటా అడిగారా..? రేషన్ కార్డు ఒక్కటే కదా మీరు అడిగింది.. ‘ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
